ఇందిరమ్మ వర్ధంతి.. ఉక్కు మనిషి జయంతి

31-10-2026 | 03:37pm

మహమ్మదాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి (Indira Gandhi Death Anniversary), భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (Sardar Vallabhbhai Patel Birth Anniversary) సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా, జిల్లా కార్యవర్గ సభ్యులు అనంతయ్య మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, దేశ ఐక్యత కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యానంతరం సంస్థానాలను ఏకీకృతం చేసి భారతదేశ సమైక్యతకు బలమైన పునాది వేశారని కొనియాడారు. మహనీయుల దేశభక్తి, సేవా స్ఫూర్తిని (Patriotism and Service) ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు బాల ముకుందం, హనుమంత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు కొత్త నరసింహులు, విష్ణువర్ధన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి తేజ రెడ్డి, సర్పంచులు అంజ్య నాయక్, శ్రీనివాసులు, రాజు నాయక్, రాజు, గ్రామ అధ్యక్షుడు నీరటి అశోక్, మాజీ ఎంపీటీసీలు అక్బర్, గూళ్ల చెన్నయ్య, మౌలాన, కొనగంటి శీను, పత్తి గోపాల్, సత్తయ్య, జట్టి నరసింహులు, డీలర్ శివ, దస్తయ్య, పార్షనాయక్, నర్సింలు, వెంకటయ్య, బుచ్చయ్య, శేఖర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు