ప్రతి పౌరుడికి సమాన హక్కులు
నాగలిగిద్ద, అక్టోబర్ 31 (విజయక్రాంతి): నాగలిగిద్ద మండలం ఇరక్పల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం (Civil Rights Day) నిర్వహించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులపై (Constitutional Rights) అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు (Equal Rights) ఉన్నాయని, వాటిని గౌరవిస్తూ ఇతరుల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన (Legal Awareness) పెంపొందించుకోవాలని, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత అధికారులను ఆశ్రయించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి సాయిలు, సర్పంచ్ శాంతప్ప, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.