అంగన్వాడీ సిబ్బందికి పట్టుచీరల పంపిణీ
19-10-2026 | 09:27pm
పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్
పటాన్ చెరు: దసరా పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం పటాన్ చెరు మాజీ జడ్పీటీసీ మాద్రి జైపాల్ ఆధ్వర్యంలో పట్టుచీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా మాద్రి జైపాల్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆయాలకు పట్టుచీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.