కంచర్లలో అన్నప్రసాద వితరణ
19-10-2026 | 09:35pm
భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం(Bikkannur mandal) కంచర్ల గ్రామంలో శ్రీ చైతన్య ఫ్రెండ్స్ యూత్(Sri Chaitanya Friends Youth) ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Sharannavaratri celebrations) భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గ్రామానికి చెందిన పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ చైతన్య ఫ్రెండ్స్ యూత్ సభ్యులు గ్రామ ప్రజలకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.