మహిషాసురమర్దిని దేవిగా దివ్య దర్శనం ఇచ్చిన అమ్మవారు
వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): శరన్నవరాత్రి మహోత్సవాల్లో(Sharannavaratri celebrations) తొమ్మిదో లక్ష్మీదేవిదే దివ్య దర్శనం ఇచ్చిన అమ్మవారురోజు శ్రీ మహిషా సురమర్దిని దేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తారు. అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దిని మహోగ్రరూపంగా భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో, సింహవాహినిగా మహిషాసురుడి సేనాపతులైన చిక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భాష్కులుడు, బిడాలుడు తదితర రాక్షసులందర్నీ సంహరించింది.
ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా వెలసింది. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన ఆమె సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సర్వ దేవతల అనుగ్రహం కలుగుతుందంటారు. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయనీ, శత్రు పరాజయం కలుగుతుందనీ, అంతఃశత్రువులు కూడా నశిస్తాయని, ధైర్యం కలుగుతుందనీ, సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందనీ భక్తుల నమ్మకం.