355 చేయూత పెన్షన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన
నాగల్ గిద్ద,(విజయ క్రాంతి): నాగల్ గిద్ద మండలంలోని 33 గ్రామ పంచాయతీల పరిధిలో నూతనంగా చేయూత పెన్షన్(pension ) కోసం దరఖాస్తు చేసుకున్న 355 మంది లబ్ధిదారుల దరఖాస్తులపై క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను ఎంపీడీవో మహేశ్వరరావు(MPDO Maheshwara Rao) బుధవారం కారాముంగి గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. దరఖాస్తుదారులను నేరుగా కలిసి వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి వివరాలను నమోదు చేశారు.
ఈ నెల 25వ తేదీ వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఇందుకోసం మండలంలోని ఐదుగురు అధికారులను ప్రత్యేక అధికారులుగా కేటాయించి, వారి పర్యవేక్షణలో పరిశీలన చేపడుతున్నట్లు చెప్పారు. అర్హులైన నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే పెన్షన్ మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారులు పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులను సంప్రదించి అవసరమైన ఒరిజినల్ పత్రాలతో వెరిఫికేషన్‌కు సహకరించాలని ఎంపీడీవో కోరారు.