సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

02-11-2026 | 12:15pm

జిన్నారం, నవంబర్ 2 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని సోలక్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) ప్రారంభించారు (Inaugurated).

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన బోనస్ (Bonus) బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు