సమ్మక్క సారక్క దేవాలయంలో ప్రత్యేక పూజలు.!
16-10-2026 | 10:04pm
పూజారి రెడ్డిపల్లి శశి కల, నరసింహులు!!
శివంపేట అక్టోబర్ 16 ( విజయక్రాంతి ) : శివంపేట మండల(Shivampet Mandal) కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామ శివారు దగ్గర దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన సమ్మక్క సారక్క దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో(Devi Navaratri celebrations) భాగంగా సమ్మక్క సారక్క దేవాలయంలో(Sammakka Sarakka Temple) ప్రత్యేక పూజలు పూజారి రెడ్డిపల్లి శశికళ నర్సింలు పుణ్య దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.