చెత్తను వేరు చేసి అందించాలి: ఎంపీడీవో మహేశ్వరరావు

25-09-2026 | 03:33pm

పుసల్పాడ్‌లో నాలుగు రకాల వ్యర్థాల సేకరణకు ప్రత్యేక ఏర్పాట్లు

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): గ్రామంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో మహేశ్వరరావు(MPDO Maheswara Rao) సూచించారు. నాగల్‌గిద్ద మండలంలోని పుసల్పాడ్ గ్రామంలో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో సర్పంచ్ హనుమంత్‌రావు పాటిల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇళ్ల వద్దనే తడి, పొడి, ప్రత్యేక జాగ్రత్తలు అవసరమైన వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు.

వీటి సేకరణకు వాహనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డబ్బాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీధుల్లో, మురుగు కాలువల్లో చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. చెత్తను వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లోకేష్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు