ఉత్తమ ఫలితాల సాధనకు తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి
ప్రిన్సిపాల్ కలకొండ రవీందర్ రెడ్డి
కోహెడ, నవంబర్ 27 (విజయక్రాంతి): రానున్న వార్షిక పరీక్షలలో విద్యార్థులు(Students) ఉత్తమ ఫలితాలు సాదించాలని.. ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం కళాశాల లో పీటీఏం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. అధ్యాపకుల సూచనలతో పాటు తల్లిదండ్రుల సహకారం కచ్చితంగా ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చున్నారు.
ఈ రెండు నెలలు ప్రతి విద్యార్థిని కళాశాలకు ప్రతిరోజు హాజరయ్యే విధంగా తల్లితండ్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండే విధంగా అధ్యాపకుల, తల్లిదండ్రుల కృషి సహకారం ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని ఫలితాలలో మన కళాశాలను రాష్ట్రస్థాయిలో నిలపాలన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన అల్పాహార, మధ్యాహ్నం భోజన పథకం కళాశాలలో ప్రారంభించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యాదగిరి, రాజమౌళి ఎస్ రాజేశ్వర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రజిత శ్రీనివాస్, నీరజ శ్రీనివాస్, సుజాత, సీతారామయ్య, నరేష్, అశోక్, చిరంజీవి, పాల్గొన్నారు.