కొత్తపల్లి పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

27-11-2026 | 07:42pm

హుజురాబాద్,నవంబర్ 27:(విజయక్రాంతి) కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు(Kottapalli Government School) వంశిక ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి చరణ్ బహుమతిగా అందించిన వాటర్ ప్యూరిఫైయర్‌ను జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే సాయి చరణ్ సేవా భావంతో పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందించడం అభినంద నీయమన్నారు.

విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు చేసిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని తెలిపారు. సేవ చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, చిన్న సహాయం కూడా ఎంతో విలువైనదని అన్నారు. విద్యార్థులు ఉన్నతంగా చదువుకుని భవిష్యత్తులో తాము చదువుకున్న పాఠశాలకు, పుట్టిన గ్రామానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

సేవా కార్యక్రమాలు చేపడుతున్న సాయి చరణ్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్ బత్తుల లక్ష్మణ్, వినయ్, రవిజేజ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు