స్టడీ మెటీరియల్ అందజేసిన మాజీ ఎంఈఓ ప్రభు దయాల్

27-11-2026 | 07:58pm

ఉద్యోగమే లక్ష్యంగా యువత పుస్తక పఠనం అలవర్చుకోవాలి

కొత్తగూడెం నవంబర్ 27 విజయ క్రాంతి : సకల పోటీ పరీక్షల(competitive examinations) కొరకు నిరుద్యోగ యువత(Unemployed youth) సన్నద్ధమవుతున్న సమయంలో , తనవంతుగా నిరుద్యోగ యువతకు(Unemployed youth) చేయూతనందిస్తూ, సమాజసేవే శ్రేయస్సుగా, దేశానికి యువత పట్టుకొమ్మలాంటి వాళ్ళు అన్న సామెతను అక్షరాల పాటిస్తూ దేశానికి యువత తోడ్పాటు ఎంత అవసరమో, యువత పిడ ధ్రువ పడకుండా సరైన సమయంలో నిర్ణయం తీసుకొని పుస్తక పఠనం వైపు మళ్ళితే ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఎంతో శోభయమానంగా ఉంటుందని తన వంతు బాధ్యతగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు,ఉపయోగపడే స్టడీ మెటీరియల్ సుమారు 100 యోజన, ఇతర స్టడీ మెటీరియల్ను పూర్వ కొత్తగూడెం ఎంఈఓ డాక్టర్ ప్రభు దయాల్, శుక్రవారం కొత్తగూడెం ప్రభుత్వ ప్రధాన గ్రంథాలయ లైబ్రేరియన్ లలిత కుమారి, కార్యదర్శి  కరుణకుమారి లకు అందజేశారు. పోటీ పరీక్ష ల సిద్ధపాటులో ఈ స్టడీ మెటీరియల్ ఉపయోగించుకోవాలని కోరారు. భవిష్యత్తులో మరింత స్టడీ మెటీరియల్ను సమకూర్చి అందించనున్నట్లు డాక్టర్ ప్రభుదయాల్ ఒక పత్రిక ప్రకటనలో తెలియాజేశారు.

మరిన్ని వార్తలు