ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్పంచ్‌లు పనిచేయాలి

08-10-2026 | 07:57pm

బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి

గజ్వేల్, అక్టోబర్ 8: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి(Gajwel constituency in-charge Vanteru Pratap Reddy) అన్నారు. గజ్వేల్ మండలం బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడిగా రంగంపేటకు చెందిన నడిగోప్పుల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా ధర్మారెడ్డిపల్లికి చెందిన కాసామొల్ల శ్రీనివాస్‌ను సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి–షాదీముబారక్, కేసీఆర్ కిట్, పల్లె ప్రగతి వంటి పథకాలతో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో నిరాశ నెలకొందని, హామీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఫోరమ్ గ్రామీణ ప్రజల గొంతుకగా పనిచేస్తూ సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు బ్యాగారి ప్రభాకర్, కోలుగురు జ్యోతి స్వామి, పిట్ల లావణ్య రమేష్, ఫహీమ్, మమత శ్రీనివాస్‌రెడ్డి, కల్పన బాలస్వామి, చెలిమేటి వెంకటలక్ష్మి, నాగమణి నర్సింలు, నాయకులు రమేష్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు