నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం

16-10-2026 | 09:55pm

రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు డీఈ స్వామి

గజ్వేల్ అక్టోబర్ 16 : రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజనీర్ స్వామి(Transco Divisional Engineer Swami) తెలిపారు. శుక్రవారం వర్గల్ శివారులోని బుచ్చిరోని కుంట ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు సమీప వ్యవసాయ పొలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

100 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (డీటీఆర్) ఓవర్‌లోడ్‌లో ఉన్నట్లు గుర్తించి, రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు యుద్ధప్రాతిపదికన అదనంగా 25 కేవీఏ డీటీఆర్‌ను ఏర్పాటు చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ లక్ష్యమని డీఈ స్వామి స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు