అల్కరాజ్ ఔట్

10-09-2026 | 05:25am

క్వార్టర్స్‌లోనే పరాజయం

షెల్టన్ సంచలన విజయం 

సెమీస్‌లో టియాఫోతో ఢీ 

యూఎస్ ఓపెన్

న్యూయార్క్, సెప్టెంబర్ 9: ఏడాది చివరి గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం నమోదయింది. డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు క్వార్టర్ ఫైనల్లో షాక్ తగిలింది. క్వార్టర్ ఫైనల్‌లో వరల్ నెం బర్ 2 అల్కరాజ్‌కు అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ ఊహించని షాకిచ్చాడు.

సుమారు నాలుగున్నర గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో షెల్టన్ 6 6 6 1 7 (10/7) తేడాతో అల్కరాజ్‌ను చిత్తు చే శాడు. గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన అల్కరాజ్ మునపటిలా సత్తా చాటలేకపోయాడు.7- తేడాతో తొ లి సెట్‌లో గట్టెక్కాడు. కానీ ఆ తర్వాత వ రుసగా రెండు సెట్లను కోల్పోయాడు. అద్వితీ యమైన ప్రదర్శనతో షెల్టన్ ఆధిపత్యం చెలాయించాడు. అయితే ఆ తర్వాత షెల్టన్ తన పవర్ గేమ్తో విరుచుకుపడ్డాడు. రిటర్న్ పొజిషన్‌ను ముందుకు మార్చి.. బలమైన ఫోర్ హ్యాండ్ షాట్లతో అల్కరాజ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాడు.

నాలుగో సెట్‌ను గెలుచుకు న్న అ ల్కరాజ్ మళ్లీ రేసులో నిలిచాడు. ఐదో సెట్లో నూ అతనికి కఠిన సవాల్ తప్పలేదు. చివరి వరకు పోరాడినా.. అల్కరాజ్కు ఓటమే ఎదురైంది. కోర్టులో చురుగ్గా ఉండే అల్కరాజ్ ఈసారి మాత్రం చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఐదో సెట్‌లో సర్వ్‌ను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

దీంతో మ్యాచ్ సూపర్ టై బ్రేక్ కు చేరింది. చివరకు 10 తేడాతో షెల్టన్ సం చలన విజయాన్ని నమోదు చేశా డు. వరుసగా రెండో టైటిల్ గెలవాలని భావించిన అ ల్కరాజ్‌కు చుక్కెదురైంది. దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్ తొలి రౌండ్‌లోనే ఇంటిము ఖం పట్టాడు. అల్కరాజ్ కూడా నిష్క్రమించడంతో.. జ్వెరెవ్, టియాఫో రేసులో నిలిచా రు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూ డో సీడ్, అమెరికా ప్లేయర్ జెస్సి కాపెగులా 3- 6- 6 తేడాతో అమెరికాకే చెంది న ఎమ్మా నవ్వార్రోను ఓడించింది.

మరిన్ని వార్తలు