వరల్డ్ నెం.1గా జ్వెరెవ్

13-10-2026 | 05:00am

న్యూయార్క్, అక్టోబర్ 12 : జర్మనీ టెన్ని స్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్(German tennis star Alexander Zverev) ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. షాంఘై మాస్టర్స్ టోర్నమెంట్లో కార్లోస్ అల్కరాజ్ అనూహ్యంగా ఓడిపోవడంతో జ్వెరెవ్ ఈ ఘనత సాధించడం ఖాయమైంది. దీనితో పాటు ఈ ఏడాదిని టాప్ ప్లేస్‌తో ముగించనున్నాడు.

టెన్నిస్ చరిత్రలో ఒక ఏడాదిని ప్రపంచ నెంబర్ వన్‌గా(World Number One) ముగించిన తొలి జర్మన్ పురుషుల ఆటగాడిగా జ్వెరెవ్ సరికొత్త రికార్డు సృష్టించాడు గతం లో బోరిస్ బెకర్ నెంబర్ వన్ స్థానాన్ని అం దుకున్నప్పటికీ, ఇయర్-ఎండ్ నెంబర్ వన్‌గా నిలవలేకపోయాడు. ఈ ఏడాది  జ్వెరెవ్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఈ సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్, యుఎ స్ ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. 

మరిన్ని వార్తలు