ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో చోళ చీఫ్స్ బోణీ

10-10-2026 | 05:20am

కాకతీయ నైట్స్‌పై 6 విజయం

ముషీరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఆర్చరీ ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)(Archery Premier League) రెండో సీజన్‌లో చోళ చీఫ్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కాకతీయ నైట్స్‌పై 6 గెలిచింది. కొలంబియా ఆర్చర్ అలెజాండ్రా ఉస్కియానో సంధించిన ఎనిమిది బాణాలూ పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించడం విశేషం. రిషభ్ యాదవ్, ఉస్కియానో అద్భుత ప్రదర్శనతో చోళ చీఫ్స్ తొలి రెండు సెట్లను గెలిచి 4 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో సెట్‌ను నీరజ్ చౌహాన్ రాణించడంతో కాకతీయ నైట్స్ గెలుచుకున్నా, నిర్ణయాత్మక నాలుగో సెట్‌లో దీపికా కుమారి, మార్కస్ డిఅల్మేడా రాణించడంతో చోళ చీఫ్స్ విజయం ఖరారైంది.

మరిన్ని వార్తలు