ఖేలో తెలంగాణ బంధన్‌కు విశేష స్పందన
హైదరాబాద్, అక్టోబర్ 26: తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ(Sports Department of Telangana State) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఖే లో తెలంగాణ బంధన్(Telangana Bandhan in Khe)’ ఫిట్నెస్ కార్యక్రమానికి ప్రజలు, క్రీడాకారులతో పాటు వివిధ ప్ర భుత్వ శాఖల అధికారుల నుంచి విశేష స్పం దన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో విద్యార్థు లు, యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని సైబరాబాద్ పోలీ స్ కమిషనర్ ఎం. రమేష్ పిలుపునిచ్చారు.
రోజువారీ జీవితంలో వ్యాయామం, శారీరక శ్రమకు ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుం బ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పా ల్గొనాలని ఆయన కోరారు.