షబ్బీర్ కోచింగ్‌లో రాటుదేలుతున్న యువక్రికెటర్లు
హెచ్‌సీఏకు ఎంపికైన నలుగురు అమ్మాయిలు
హైదరాబాద్, అక్టోబర్ 26: మహిళల క్రికెట్‌కు(Womens cricket) ఆదరణ పెరిగిన వేళ హైదరాబాద్‌కు చెందిన పలువురు యువక్రికెటర్లు సత్తా చా టుతున్నారు. బి స్పోర్టీ క్రికెట్ అకాడమీ కోచ్ షబ్బీర్(Coach Shabbir of B Sporty Cricket Academy) శిక్షణలో నలుగురు అమ్మాయిలు హెచ్‌సీఏ అండర్ 15 జట్లకు ఎంపికయ్యారు. యువ క్రికెటర్లు భవిష్య, నీతూ,అనన్య,అశ్విక ఇటీవల ప్రకటించిన హెచ్‌సీఏ అండర్ 15 పరిమిత ఓవర్ల టోర్నీలో చోటు దక్కించుకున్నారు.
అశ్విక హైదరాబాద్ బి టీమ్‌కు, అన న్య హెచ్‌సీఏ లీగ్‌కు ఆడుతుండగా, నీతూ ఇప్పటికే అండర్ 16 జట్టుకు ప్రాతినిథ్యం వ హించి ఇప్పుడు అండర్ 19 ప్రాబబుల్స్‌లో ఉంది. అలాగే మరో యువ క్రికెటర్ భవిష్య కూడా అండర్ 15 బాలికల జట్టుకు ఆడుతో ంది. వీరందరికీ షబ్బీర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.అటు షబ్బీర్ కోచింగ్‌లోనే రాటుదే లిన యువక్రికెటర్లు అరవ్ రెడ్డి, అరుష్ వో రా హెచ్‌సీఏ లీగ్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. 2010 నుంచి ఏపీ స్టేజ్ టీమ్ కు సౌత్ జోన్, విజయహజారే ప్రాబబుల్స్‌లో ఉన్న షబ్బీర్ ప్రస్తుతం యువక్రికెటర్ల కు కోచ్‌గా ఉన్నారు.