ధనాధన్ కు వేళాయె

06-10-2026 | 05:15am

విండీస్‌తో వన్డే సిరీస్ ముగిసింది. ఇక టీ20 వినోదం మొదలు కాబోతోంది. ఆసియా క్రీడల్లో(Asian Games) స్వర్ణం గెలిచిన టీమిండియా(Team India) ఇప్పుడు కరేబియన్లతో ధనాధన్ సమరానికి సిద్ధమైంది. అటు చివరి వన్డే గెలిచి జోష్‌తో ఉన్న విండీస్ జట్టులోకి టీ20 హిటర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అభిమానులకే అసలు సిసలు క్రికెట్ మజా లభించనుంది.

  1. నేటి నుంచే భారత్, విండీస్ టీ20 సిరీస్
  2. లక్నో వేదికగా తొలి మ్యాచ్
  3. భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి
  4. హిట్టర్స్ రాకతో బలంగా విండీస్

లక్నో, అక్టోబర్ 5 : భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌కు(T20 series) అంతా సిద్ధమైంది. మంగళవారం లక్నో ఏక్‌నా క్రికెట్ స్టేడియం(Lucknow Ekana Cricket Stadium) వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది. ఆసియా క్రీడల్లో(Asian Games) పాక్‌ను చిత్తు చేసిన స్వర్ణం గెలిచిన టీమిండియా ఒకరోజు వ్యవధిలోనే విండీస్‌పై బరిలోకి దిగుతోంది. స్వదేశంలోనే సిరీస్ జరుగుతున్న నేపథ్యం లో ఇబ్బందేమీ ఉండకపోయినా ప్రయాణబడలికతో ఆటగాళ్లు ఎలా ఆడతారనేది చూ డాలి. సొంతగడ్డపై టీ20 సిరీస్ ఆడుతుండడంతో టీమిండియా ఫెవరెట్‌గా కనిపిస్తున్న ప్పటికీ కరేబియన్లను తక్కువ అంచనా వేయలేం.

ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. తుది జట్టు లో ఒకటి రెండు మార్పులు మినహా ఆసి యా గేమ్స్‌లో ఆడిన జట్టే దాదాపు విండీస్‌పైనా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్ విభాగా నికి వస్తే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ మ రోసారి ఓపెనర్లుగా వచ్చే అవకాశముంది. ఆసియా గేమ్స్‌లో నిరాశపరిచినా సంజూ శాంసన్‌కు మరో అవకాశం దక్కనుంది. వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు లేనట్టే. దీనిపై ఇప్పటికే కోచ్ గంభీర్ కూడా క్లారిటీ ఇచ్చాడు.

రెండేళ్లుగా ఆడుతున్న సీనియర్లను పక్కన పెట్టి అతన్ని ఆడించడం కష్టమని గంభీర్ తేల్చేశాడు. ఇక వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌కు రానున్నారు. ఆల్‌రౌండర్  శివమ్ దూబే ఆరో స్థానంలో ఆడనున్నాడు. మరోవైపు బౌలింగ్ విషయానికొస్తే స్టార్ పేసర్ బుమ్రాకు విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో అర్షదీప్‌సింగ్ భారత బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేయనున్నాడు. అతడికి తోడుగా ప్రిన్స్ యాదవ్ లేదా మయాంక్ యాదవ్‌లో ఒకరు బాధ్యత పంచుకోనున్నారు.

స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్‌పై వేటు పడే అవకాశముంది. ఆసియా క్రీడల్లో బిష్ణోయ్ నిరాశపరిచాడు. దీంతో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. ఆల్‌రౌండర్లుగా దూబే, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్‌రెడ్డి కొనసాగనున్నారు. నమన్ ధీర్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇదిలా ఉంటే వన్డే సిరీ స్ కోల్పోయినా చివ రి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి గెలిచిన విండీస్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. పైగా టీ20 ఫార్మాట్‌లో కరేబియన్లు ఎప్పు డూ బలంగానే ఉం టారు.

టీ20 స్పెషలిస్టులు హెట్ మెయిర్, పావెల్, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్ వంటి ఆటగాళ్ల రాకతో విండీస్ మరింత బలంగా మారింది. ఐపీఎల్ ఆడు తూ భారత్ పిచ్‌లపైనా వీరందరికీ మంచి అవగాహనే ఉంది. దీం తో టీ20 సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు. గత రికార్డుల విషయానికొస్తే భారత్‌దే పైచేయి గా ఉంది. ఇరు జట్ల మధ్య 31 టీ20లు జరిగితే 20 మ్యాచ్‌లలో టీమిండియా గెలిచింది. 10 మ్యాచ్‌లలో విండీస్ విజయం సా ధించింది. లక్నో వికెట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద బౌండరీల కారణంగా పరుగులు చేయడం బ్యాటర్లకు అంత ఈజీ కాదు. 

తుది జట్ల అంచనా

భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నమన్ ధీర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్/మయాంక్ యాదవ్

వెస్టిండీస్ : కామిల్ పూరన్, షై హోప్, హెట్‌మెయిర్, రోస్టన్ ఛేజ్, రోవ్‌మన్ పావెల్, షెర్పాన్ రూథర్‌ఫర్డ్, కీమో పాల్, రొమారియో షెపర్డ్, మాథ్యూ ఫోర్డ్, అకిల్ హోస్నేన్, సమర్ జోసెఫ్

మరిన్ని వార్తలు