7 September, 2026 | 1:47 AM

జోడీ అదుర్స్

07-09-2026 | 12:00am

చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు సాత్విక్, చిరాగ్

చైనా మాస్టర్స్ టైటిల్ కైవసం 

ఈ సీజన్‌లో రెండో టైటిల్

భారత బ్యాడ్మింటన్(Indian Badminton) చరిత్రలో మరో అద్భుత విజయం.. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల ముందు అదిరిపోయే విజయం.. పురుషుల డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj), చిరాగ్ శెట్టి(Chirag Shetty) చైనా మాస్టర్స్ టైటిల్ కైవసం చేసుకుంది. తుది పోరులో ఆతిథ్య దేశానికి చెందిన జోడీపై గెలిచింది. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకు న్న భారత్ జోడీ ఈ సారి పట్టువదలకుండా విజేతగా నిలిచింది.

బీజింగ్, సెప్టెంబర్ 6: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి , చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించి ంది. ప్రతిష్ఠాత్మక చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచిం ది. పురుషుల డబుల్స్ ఫైనల్ పోరులో ఈ జోడీ అద్భుత విజయాన్ని అందుకుంది. టైటిల్ పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్- జోడీ 11- 21 21 తేడాతో చైనాకు చెందిన మాజీ వరల్డ్ నంబర్ 4 జోడీ హే జీ టింగ్ గ్జియాంగ్‌ను మట్టికరిపించింది.

తొలిసెట్‌ను 11 తో కోల్పోయినప్పటికీ, భారత ద్వయం ఒత్తిడిని అధిగమించి అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు సెట్లను గెలుచుకొని ఛాంపియన్లుగా అవతరించింది. ఈ మ్యాచ్ దాదా పు 70 నిమిషాల పాటు సాగింది. రెండో గేమ్‌లో చిరాగ్ నెట్ వద్ద దూకుడుగా ఆడి చైనా ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడంతో, భారత్ ఆ గేమ్‌ను 21 తేడాతో గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది.

మూడో, నిర్ణయాత్మక గేమ్ హోరాహోరీగా సాగింది. సాత్విక్ తన వ్యూహాలను మార్చుకుంటూ నిలకడగా కచ్చితమైన షాట్లు ఆడాడు. స్కోరు 18 ఉన్నప్పుడు సాత్విక్ చేసిన ఓ తెలివైన సర్వ్ చైనా జోడీని షాక్‌కు గురిచేసింది. గతంలో ఈ టోర్నీలో రెండుసార్లు (2023, 2025 సీజన్లలో) ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ ఈసారి చైనా ఫోబియాను వీడి ఎట్టకేలకు టైటిల్‌ను ముద్దాడారు. ఈసారి చైనా అభిమానుల సమక్షంలో ఆతిథ్య జట్టును ఓడించి, గత ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.

సాత్విక్ జోడీకి 2026 సీజన్‌లో ఇది రెండో టైటిల్. ఈ మధ్యే ఈ జంట సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను కూడా సాధించింది. చైనా గడ్డపై స్థానిక ఆటగాళ్లను ఓడించి, ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ నెగ్గిన తొలి భారతీయ జోడీగా సాత్విక్-సరికొత్త రికార్డు నెలకొల్పారు. రాబోయే ఆసియా క్రీడలకు ముందు చైనా గడ్డపై సాధించిన ఈ విజయం సాత్విక్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందే హం లేదు.

మరిన్ని వార్తలు