స్పెషల్ గిఫ్ట్

04-11-2026 | 10:07am

న్యూజిలాండ్ రగ్బీ లెజెండ్ సర్‌ప్రైజ్!

క్రికెట్ స్టార్లను కలిసిన రగ్బీ లెజెండ్.. స్పెషల్ జెర్సీలతో సర్‌ప్రైజ్!

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి ODI మ్యాచ్‌కు ముందు ఆక్లాండ్‌లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో(Team India captain Shubman Gill) పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు న్యూజిలాండ్ రగ్బీ దిగ్గజం కెవెన్ మీలాము ప్రత్యేక బహుమతులు అందించారు. ఈ ముగ్గురు క్రికెట్ స్టార్లను కలిసిన All Blacks మాజీ కెప్టెన్.. వారికి Personalised Jerseys అందించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ ప్రత్యేక భేటీ మ్యాచ్ ప్రారంభానికి ముందే అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ప్రపంచ రగ్బీలో చెరగని ముద్ర!

కెవెన్ మీలాము న్యూజిలాండ్ జాతీయ రగ్బీ జట్టు తరఫున ఏకంగా 132 మ్యాచ్‌లు ఆడారు. All Blacks చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో ఆయన ఒకరు. జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన మీలాము.. తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా 2011, 2015 Rugby World Cup విజేత జట్లలో మీలాము కీలక సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ రగ్బీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆయన.. ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజాలు కోహ్లీ, రోహిత్, గిల్‌ను కలవడం విశేషంగా మారింది.

క్రికెట్, రగ్బీ దిగ్గజాల కలయిక!

ఒకవైపు క్రికెట్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. మరోవైపు రగ్బీలో తనదైన ముద్ర వేసిన కెవెన్ మీలాము. ఈ రెండు క్రీడా ప్రపంచాల ప్రముఖుల కలయిక అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్యక్తిగత పేర్లతో రూపొందించిన Jerseys అందుకోవడంతో భారత ఆటగాళ్లకు ఈ భేటీ మరింత ప్రత్యేకంగా మారింది.

మరిన్ని వార్తలు