26, 27 తేదీల్లో రైడ్స్--2026 సదస్సు

04-11-2026 | 05:05am

గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహణ

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): సివిల్ ఇంజినీరింగ్ రంగంలో(Field of Civil Engineering) స్థిరత్వం, ఆవిష్కరణలు, ఆధునిక డిజైన్(Modern design), సుస్థిర నిర్మాణాలపై చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్(Association of Consulting Civil Engineers) (ఇండియా) హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో రైడ్స్--2026 సదస్సుతో పాటు బిల్డ్-టెక్ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. నవంబర్ 26, 27 తేదీల్లో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ సదస్సులో 1,000 మందికి పైగా సివిల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక ప్రముఖులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొననున్నారు. నలంద విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ సునైనా సింగ్ ముఖ్యోపన్యాసం చేయనున్నారు. సీబీఆర్‌ఐ రూర్కీకి చెందిన డాక్టర్ ప్రదీప్ కుమార్ రామంచర్ల వాతావరణ మార్పులు, భూకంపాలు, వరదలను తట్టుకునే మౌలిక సదుపాయాలపై ప్రసంగించనున్నారు. డాక్టర్ సందీప్ షిర్ఖేడ్కర్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై వివరించనున్నారు.

అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ఇంగ్. మార్వాన్ అల్జైలై, డాక్టర్ వి. రాజేంద్రన్, డాక్టర్ ఎన్. ఆనందవల్లి, డాక్టర్ మహమ్మద్ సాజిద్ అబ్బాసి, రాయ్ అనిరుద్ధ, ఇంజినీర్ వి. ఉమామహేశ్వరన్, ఇంజినీర్ వీరేష్ ఎస్.సి., డాక్టర్ అంకిత్ గార్గ్, ఇంజినీర్ వి. జగదీష్ కుమార్, ఇంజినీర్ గురురాజ్ ఎస్. థాలి వివిధ ఆధునిక నిర్మాణ సాంకేతికతలు, డిజిటల్ ఇంజినీరింగ్, భవనాల భద్రత, సుస్థిర నిర్మాణాలపై తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ కార్యక్రమం నిర్వహణలో ఛైర్మన్ ఇంజినీర్ భీమ్ రావు జలిగామ, ఆర్గనైజింగ్ ఛైర్మన్ ఇంజినీర్ రాజ్కుమార్ కాచర్ల, ఏసీసీఈఐ సెక్రటరీ జనరల్ ఇంజినీర్ అడెపు కాశీరాం, ఆర్గనైజింగ్ కో-ఛైర్మన్ ఇంజినీర్ సద్ది మహేందర్ రెడ్డి, వైస్ ఛైర్మన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజినీర్ సి. రమేష్, గౌరవ కార్యదర్శి ఇంజినీర్ డి.ఎస్. జయ ప్రకాష్, ఆర్గనైజింగ్ ట్రెజరర్ ఇంజినీర్ రుద్ర అమర్నాథ్ బాబు, మీడియా కన్వీనర్ ఇంజినీర్ అక్కల సుధాకర్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు