ఏఈఈ హాల్‌టికెట్లు విడుదల
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(Assistant Executive Engineer) (ఏఈఈ-సివిల్) నియామక పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను(Hall Tickets) టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 5వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, ఈసారి హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రక్రియలో కమిషన్ సరికొత్త మార్పును తీసుకొచ్చింది.
అభ్యర్థులు తమ హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకునే సమయంలో లైవ్ ఫోటో(Live Photo) సిస్టమ్ ద్వారా సమర్పించడం (సబ్మిట్ చేయడం) తప్పనిసరి చేసింది. ఆన్లైన్ వెబ్‌క్యామ్ లేదా డివైజ్ కెమెరా ద్వారా ఈ లైవ్ ఫోటోను క్యాప్చర్ చేసి అప్లోడ్ చేసిన తర్వాతే హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవడానికి వీలవుతుంది. ముందుగానే డౌన్లోడ్ చేసుకుంటే మేలు.