పోలీసుల ఎన్కౌంటర్
శివసాగర్ : గౌహతి హోటల్ కాల్పుల ఘటనలో(Guwahati hotel firing) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురి ప్రాణాలు తీసిన ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఘనకాంత గొగోయ్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. అసోంలోని శివసాగర్ జిల్లాలో బుధవారం Police Custody నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ Encounter జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నం!
34 ఏళ్ల ఘనకాంత గొగోయ్‌ను మంగళవారం గౌహతిలోని కోర్టు Judicial Custodyకి పంపింది. హోటల్ కాల్పుల కేసులో అరెస్టయిన కొద్దిసేపటికే, 2024 నాటి Bank Fraud కేసులో శివసాగర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసు విచారణలో భాగంగా శివసాగర్‌కు తరలిస్తుండగా గౌరిసాగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గమధ్యంలో పోలీసు వాహనం నుంచి కిందకు దిగిన గొగోయ్.. కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో దర్యాప్తు అధికారికి చెందిన Service Weaponను లాక్కునేందుకు ప్రయత్నించినట్లు సీనియర్ పోలీసు అధికారి పపోరి ఛెటియా తెలిపారు. ఈ క్రమంలో నిందితుడికి, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అధికారిని రక్షించేందుకు శివసాగర్ సదర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ కాల్పులు జరిపినట్లు SSP వెల్లడించారు. ఈ కాల్పుల్లో గొగోయ్‌కు బుల్లెట్ గాయమైంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడు శిక్షణ పొందిన Shooter అని, పలు రకాల ఆయుధాల వినియోగంలో అనుభవం ఉందని పోలీసులు తెలిపారు.
ఐదుగురి ప్రాణాలు తీసిన హోటల్ కాల్పులు
అసోంలోని గౌహతిలో అక్టోబర్ 26 రాత్రి హోటల్ బిలాస్ ఇన్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. బోరా సర్వీస్ ప్రాంతంలోని హోటల్ నిర్వహణ విషయంలో ఆస్తి యజమానులు, Leaseholder మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ గొడవ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన నలుగురితో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి గాయపడ్డారు. అప్పటి నుంచి ఈ కేసు అసోంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ప్రధాన నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందడంతో కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.