సంతక పోతే... సెల్లులు గోవిందా!
సంతలో ఒకేరోజు 9 సెల్లులు.. మాయం.
గుడి ఆవరణలోనే షట గోపం... పెడుతున్న దొంగలు
పనిచేయని నిఘానేత్రాలు... గగ్గోలు పెడుతున్న బాధితులు.
తుంగతుర్తి (విజయక్రాంతి): గడిచిన కొన్ని సంవత్సరాలుగా.. తుంగతుర్తి సంతలో(Thungathurthy Market) కొనుగోలు చేసుకోవడానికి వెళ్లిన సామాన్య ప్రజలకు ఒకపక్క సెల్లులు మాయం, మరొక ప్రక్క జేబులో నుంచి పర్సులు పోగొట్టుకున్న సంఘటన జోరుగా సాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో కూత వేటు పోలీస్ స్టేషన్ దూరంలో, కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సంతలో సోమవారం రోజున కొనుగోలు చేయడానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి వస్తున్న ప్రజలకు చేదు అనుభవాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన సంవత్సరంలో కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలకు ఒక ప్రక్క సెల్లులు మరొక ప్రక్క పర్సులు.. జేబుదొంగల పనితో పోగొట్టు కున్నారు.
కొన్ని తిరిగి పోలీసు వారు, అత్యాధునిక సాంకేతికతో, తిరిగి కొందరు సెల్లులు పొందారు. మెయిన్ రోడ్డు, సంతలో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో, మోలిగే నక్కపై, తాటి పండు పడ్డట్టు చందంగా మారింది. సోమవారం ఒక్కరోజే 9 సెల్లులు పోగొట్టుకున్నట్లు ఓ వ్యక్తి ఈయం పై ఈఎంఐ పై కొనగా మొదటి నెల కూడా పూర్తికాలేదని ఆవేదన వ్యక్తం చేశారు, రోడ్లపై గుసగుసలు జరుగుతున్నాయి. మరొక పక్క కొంతమంది ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి, మెయిన్ రోడ్డు కూడలి, సంత ,పోలీస్ స్టేషన్కు నిఘా నేత్రాలు పనిచేసే విధంగా కృషి చేయాలని బాధితులు, సామాన్య ప్రజలు కోరుతున్నారు.