‘కింగ్‌100’లో రాజకీయ రాణి.. టబు లుక్ వైరల్!

04-11-2026 | 10:29am

‘కింగ్‌100’లో టబు పవర్‌ఫుల్ ఎంట్రీ.. ఝాన్సీ రాణిగా ఫస్ట్‌లుక్‌

అదృష్టాన్ని నమ్మేవారంటే నచ్చదట.. టబు పాత్రలో ట్విస్ట్

అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘కింగ్‌100’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా చిత్రబృందం టబు First Look Posterను విడుదల చేసింది. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ‘మహంతి ఝాన్సీ రాణి’ పాత్రను పరిచయం చేసింది. రాజసం, రాజకీయ పలుకుబడి, గంభీరమైన వ్యక్తిత్వంతో టబు లుక్ ఆకట్టుకుంటోంది. విడుదలైన Glimpseలో ఆమె పాత్ర ఆలోచనా విధానం ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలో కష్టాన్ని నమ్మేవారు, అదృష్టాన్ని నమ్మేవారు అనే రెండు రకాల మనుషులుంటారని భావించే ఝాన్సీ రాణికి.. అదృష్టాన్ని నమ్మేవారంటే అస్సలు ఇష్టం లేదని చూపించారు. రాజకుటుంబానికి చెందిన వ్యక్తిగా, రాజకీయాల్లో ప్రభావం చూపే నాయకురాలిగా ఆమె కనిపించనుంది.

ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని Annapurna Studios నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. నాగార్జునను స్టైలిష్, హుందా పాత్రలో చూపించిన తొలి Glimpse ఇప్పటికే ఆసక్తి పెంచింది. ఇప్పుడు టబు ఎంట్రీతో సినిమాపై మరింత హైప్ నెలకొంది. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో నాగార్జున, టబు పాత్రలు ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి!


మరిన్ని వార్తలు