ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సింధు
ఆన్ సే యంగ్‌తో టైటిల్ పోరు
పారిస్, అక్టోబర్ 24 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ తెలుగుతేజం సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన హినా అకేచీపై విజయం సాధించింది. హో రాహోరీగా సాగిన పోరులో సింధు 21 20 21 స్కోరుతో పోరాడి గెలిచింది. తొలి గేమ్‌ను సునాయాసంగా గెలి చిన సింధుకు తర్వాతి గేమ్‌లో చుక్కెదురైంది. అద్భుతంగా పుంజుకున్న అకేచీ గేమ్ గెలిచి స్కోరు సమం చేసింది. ఇక మూడో గేమ్ సైతం చాలాసేపు నువ్వా నేనా అన్నట్టు సాగింది.
అయితే చివర్లో సింధు ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా చక్కని ఆటతీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది సూపర్ 750 ఫైనల్‌కు చేరడం సింధుకు ఇది రెండోసారి. జూలైలో ఆమె జపాన్ ఓ పెన్ సూపర్ 750 టైటిల్ కైవసం చేసుకోవడం ద్వారా ఆ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో సింధు ప్రపంచ నెంబర్ వన్ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్‌తో తలపడుతుంది. గత రికార్డుల్లో పూర్తిగా ఆన్ సే యంగ్‌దే పైచేయిగా ఉంది. 10 సార్లు తలపడగా అన్నింటిలోనూ సింధు ఓడిపోయిం ది. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్‌లో సైతం సింధు ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. ఆ ఓటములకు ప్రతీకారం తీర్చుకునేందుకు సింధుకు ఫ్రెంచ్ ఓపెన్ మంచి అవకాశంగా చెప్పొచ్చు.