విండీస్ విజయాలకు ఓ హోప్

16-10-2026 | 05:00am

కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో అదుర్స్

మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు

హైదరాబాద్, అక్టోబర్ 15: భారత పర్యటనలో వెస్టిండీస్ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. అయితే మూడో వన్డే నుంచి విండీస్ జట్టు అదరగొడుతోంది. టీ20 సిరీస్‌ను సమం చేసి భారత్‌కు సవాల్ విసిరింది. విండీస్ విజయాల్లో ఆ జట్టు కెప్టెన్ షై హోప్‌(Shai Hope)దే కీలకపాత్ర. ఫార్మాట్‌తో సంబంధం లే కుండా హోప్ అదరగొడుతున్నాడు.

ఇప్పటి వరకూ వరుసగా మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడు. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన హోప్ ఇన్ని అవార్డులతో తనకు తిరిగి వెళ్లేటప్పుడు లగేజీ ఇబ్బం దులు తప్పవంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. హైదరాబాద్ మ్యాచ్‌లో సెంచరీ తన కెరీర్‌లో ఒక బెస్ట్ ఇన్నింగ్స్‌గా చెప్పుకొచ్చాడు. చివరి రెండు బంతుల్లో భారీ సిక్సర్లు బాది శతకం పూర్తి చేసుకున్న హోప్ సారథిగానూ ఆకట్టుకుంటున్నాడు. కాగా భారత్ స్వదేశీ మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ గోల్డెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా అందిస్తోంది.

మరిన్ని వార్తలు