2027 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్

16-10-2026 | 05:05am

జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా నిర్ణయం

హరారే, అక్టోబర్ 15: జింబాబ్వే వన్డే, టీ20 కెప్టెన్ సికందర్ రజా(Sikandar Raza) కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. తాజాగా తన రిటైర్మెంట్‌పై పూర్తి స్పష్టతమిచ్చాడు. కెరీర్ ముగింపు దశలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడనుండడం ఒక వరంలా భావిస్తున్నట్లు తెలిపాడు.పతి క్రికెటర్ ప్రపంచకప్ ఆడిన తర్వాత రిటైర్ అవ్వాలని కలలు కనడం సహజమనీ, తన వయసు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉంన్నాడు. స్వదేశంలో జరిగే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభించడం వ్యక్తిగతంగా తనకు వరం లాంటిదని భావిస్తున్నట్టు చెప్పాడు.

రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చేశాడు. 2013లో జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సికందర్ రజా ఆ దేశం తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. 13 ఏళ్ల కెరీర్లో సికందర్ రజా 22 టెస్టుల్లో 1,434 పరుగులు, 159 వన్డేల్లో 4,704 పరుగులు, 144 టీ20ల్లో 3,244 పరుగులు సాధించాడు. తాను 22 టెస్టులు మాత్రమే ఆడినప్పటికీ, ఒక క్రికెటర్‌గా  ఎదగడంలో టెస్టు ఫార్మాట్ కీలకపాత్ర పోషిందని చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు