హైదరాబాద్ రంజీ జట్టును రద్దు చేయాలి
- జట్టు ఎంపికలో భారీ అవినీతి
- టీసీఏ తీవ్ర ఆరోపణలు
- బీసీసీఐ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరిక
హన్మకొండ, అక్టోబర్ 12 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై(Hyderabad Cricket Association) తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) తీవ్ర ఆరోపణలు చేసింది. హైదరాబాద్ రంజీ జట్టు ఎంపికలో తీవ్ర అ క్రమాలు జరిగాయని, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University, Warangal) గ్రౌండ్స్‌లో టీసీఏ అండర్-19 స్టేట్ లీగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీసీఏ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి దారం గురువారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి మాట్లాడారు.
టీసీఏ ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి మాట్లాడుతూ, రంజీ జట్టు ఎంపిక ప్రక్రియలో అంబటి రాయు డు, హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి ప్రతిభను పక్కనబెట్టి వ్యాపార ప్రయోజనాలకు ప్రాధా న్యం ఇచ్చారని ఆరోపించారు. క్రికెట్ కిట్లు, టీ-షర్టులు విక్రయించే కంపెనీల ప్రతినిధుల వద్ద డబ్బులు తీసుకుని వారికి రంజీ జట్టు లో చోటు కల్పించారని, అర్హులైన తెలంగాణ స్థానిక క్రీడాకారులను పూర్తిగా పక్కనబెట్టారని మండిపడ్డారు. ఎంపిక విధానం, ప్రమా ణాలు, జిల్లా ఆటగాళ్లకు జరిగిన అన్యాయం పై హెచ్‌సీఏ నేతలు తమతో బహిరంగ చర్చ కు రాగలరా అని సవాల్ విసిరారు.
రంజీ ఎంపికల్లో పారదర్శకత, బాధ్యతారాహిత్యం కొరవడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ తీరును నిరసిస్తూ, తెలంగాణలోని 32 జిల్లాల నుండి ప్రతిభావంతులైన ఆటగాళ్లతో సొంతంగా జట్లను సిద్ధం చేసి దేశవాళీ పోటీలకు పంపిస్తామని టీసీఏ ప్రకటించింది. జిల్లా స్థాయి క్రీడాకారుల భవిష్యత్తును ఇలా గే నిర్లక్ష్యం చేస్తే, వేలాది మంది యువ క్రికెటర్లను తరలించి బీసీసీఐ ప్రధాన కార్యాల యం ముట్టడిస్తామని హెచ్చరించారు. టీసీ ఏ ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ, హెచ్‌సీఏ కేవలం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, మిగతా 32 జిల్లాల క్రికెటర్లను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.