పరుగుల వరదే

13-10-2026 | 05:05am
  1. ఉప్పల్ స్టేడియంలో బౌలర్లకు కష్టాలే
  2. బ్యాటింగ్ స్వర్గధామంగా పిచ్
  3. ఇక్కడే టీ20ల్లో భారత్ అత్యధిక స్కోరు

హైదరాబాద్, అక్టోబర్ 12 : టీ20 ఫార్మాట్(T20 format) అంటేనే బ్యాటర్లకు పండగ. అభిమానులకు మరింత వినోదం అందించే ఉద్దేశంతో బ్యాటింగ్ పిచ్‌లే రూపొందిస్తుంటారు. ప్రస్తు తం భారత్, వెస్టిండీస్(India, West Indies) టీ20 సిరీస్‌లోనూ పరుగుల వరద పారుతోంది. రాంఛీలో ఏకంగా 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇండోర్‌లో సైతం 400 ప్లస్ రన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో తర్వాతి మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం(Uppal Rajiv Gandhi International Stadium) వేదికగా బుధవారం మ్యాచ్ జరగబోతోంది.

నాలుగో టీ20లోనూ(T20) మరోసారి బౌలర్లకు కష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే ఉప్పల్ పిచ్ కూడా ఫ్లాట్ వికెట్ కావడమే. ఇక్కడ ఎప్పుడు మ్యాచ్ జరిగినా బ్యాటర్లదే పైచేయిగా ఉంటుంది. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా భారీస్కోర్లు నమోదవుతుంటాయి. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ అత్యధిక స్కోరు కూడా ఉప్పల్ స్టేడియంలోనే నమోదైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌తో జరి గిన టీ20లో టీమిండియా ఏకంగా 297/6 స్కోరు సాధించింది. ఓపెనర్ సంజూ శాంస న్ సెంచరీ బాదేశాడు.

కేవలం 47 బం తుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అంతకుముం దు ఇక్కడ ఆడిన రెండు టీ20ల్లోనూ భారీస్కోర్లే వచ్చాయి. కాగా ఉప్పల్ స్టేడియంలో టీమిండియాకు అద్భుతమైన రికార్డుంది. హైదరా బాద్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యంతో విజయాల ను అందు కుంది. కాగా విండీస్‌తో జరిగే నా లుగో టీ20 కోసం బ్యాటింగ్ పిచ్ సిద్ధమైంది. కొత్త పిచ్‌ను తయారు చేసినప్పటకీ పూర్తిగా బ్యా టర్లకే అనుకూలంగా ఉండనుంది. దీంతో బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.

అందులోనూ బౌండరీలు చి న్నవిగా ఉండడంతో ఇక్కడ కూడా 200 పైగా స్కోర్లు న మోదవడం ఖాయంగా కనిపిస్తోంది. మంచు ప్రభావం కూడా ఉండనుండడంతో ఛేజింగ్ చేసే జట్టుకు మరింత అడ్వాంటేజ్ ఉంటుం ది. దీంతో మరోసారి టాస్ కీలకం కానుంది. ఇరు జట్లలోనూ టీ20 హిట్టర్స్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ఫ్యాన్స్‌కు అసలు సిసలు టీ20 మజా లభించనుంది.

అయితే ఈ సిరీస్ కోసం రూపొందించిన పిచ్‌లపై ఇప్పటికే హెడ్ కోచ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడు. రాంఛీలో ఓటమి తర్వాత, ఇండోర్‌లో విజయం సాధించినా పిచ్‌లపై గౌతీ అసహనంతో కనిపించాడు. ఇలాగైతే బౌలర్ల కెరీర్‌లు ముగిసిపోతాయంటూ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పిచ్ కూడా బ్యాటింగ్‌కే అనుకూలి స్తుందన్న అంచనాలతో గంభీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

మరిన్ని వార్తలు