కమ్యూనిస్టు నేత బండి మల్లయ్యకు ఘన నివాళి
01-10-2026 | 10:55pm
జాజిరెడ్డిగూడెం,(అర్వపల్లి): మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు బండి మల్లయ్య(Communist Leader Bandi Mallaiah) 8వ వర్ధంతి కార్యక్రమం గురువారం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా గ్రామంలోని ఆయన స్మారక స్థూపం వద్ద నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ బండి మల్లయ్య తన జీవితాంతం పేద ప్రజల హక్కుల కోసం,రైతు కూలీల సంక్షేమం కోసం పోరాడిన గొప్ప కమ్యూనిస్టు యోధుడని కొనియాడారు.ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు,యాదవ సంఘం రాష్ట్ర నాయకుడు బండి పెద్ద లింగయ్య,బండి చిన్న లింగయ్య,బుడిగె వెంకటయ్య,మీసాల సుందర్,దూడెల లింగస్వామి,యాదవ సంఘం నాయకులు,గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.