రోడ్డు ప్రమాద బాధిత సర్పంచ్‌కు పరామర్శ..
మొక్క నాగమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి
మోతె, నవంబర్ 01 (విజయక్రాంతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మోతె మండలం ఉర్లుగొండ గ్రామ సర్పంచ్ మొక్క వెంకటేశ్వర్లును మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి(Congress President Santosh Reddy) పరామర్శించారు. అనంతరం స్వర్గీయ మొక్క నాగమ్మ దశదిన కర్మలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు భూక్య బిక్కు, దారమళ్ళ గోవర్ధన్, భూక్య మల్సూర్, హలవత్ స్వామి, లింగయ్య, బర్మావత్ మల్సూర్, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.