ప్రజాపాలనలను అభివృద్ధిలో నడపడం ప్రతి ఒక్కరి బాధ్యత
మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి(విజయ క్రాంతి): తెలంగాణ ప్రజాపాలన(Telangana Peoples Governance) దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడుతూ..స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ప్రజల గౌరవం, హక్కులు, సంక్షేమాన్ని కాపాడుతూ, ప్రజల భాగస్వామ్యంతో, పారదర్శకతతో, సమానత్వంతో కూడిన ప్రజా పాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.త్యాగధనుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణను మరింత ప్రగతిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డైరెక్టర్లు పాక అమృతమల్లు, కొమ్ము వెంకన్న, బానోతు శ్రీను నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్, రవి నాయక్, రైతులు,మార్కెట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.