సాయుధ పోరాట నిప్పు రవ్వ కామ్రేడ్ ఐలమ్మ ములకలపల్లి రాములు
10-09-2026 | 10:31pm
కోదాడ,(విజయక్రాంతి): దొరలు భూస్వాల్ని ఎదిరించి తమ హక్కుల కోసం పోరాడిన వీర నారీమణి చిట్యాల ఐలమ్మ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. గురువారం కోదాడ(Kodada) పట్టణంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ 41వ వర్ధంతి(Ilamma death anniversary) సందర్భంగా ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.