శ్రీ సరస్వతి దేవి అలంకరణలో దుర్గామాత

16-10-2026 | 06:08pm

శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విద్యార్థిని విద్యార్థులు. 

నేరేడుచర్ల అక్టోబర్ 16(విజయక్రాంతి): దేవి నవరాత్రి దసరా వేడుకలలో(Dussehra celebrations) భాగంగా మూడవ రోజు శ్రీ విజయ దుర్గాదేవి,శ్రీ సరస్వతి దేవి అలంకరణలో మంగళవారం దర్శనమిచ్చారు. నేరేడుచర్ల పట్టణంలో(Nereducherla town) గల శ్రీ విజయదుర్గ దేవి ఆలయం(Sri Vijayadurga Devi Temple), శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర  ఆలయంలో ఆరవ రోజు  శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శ్రీ సరస్వతి దేవి  అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా విద్యావ్యాప్తికై జ్ఞాపక శక్తి కై ఉద్యోగ ప్రాప్తికై విద్యార్థిని విద్యార్థుల చేత శ్రీ సరస్వతి దేవి అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.ఆలయ అర్చకులు మొలుగు శ్రీనివాసాచార్యులు,ఉగ్రదండి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమ పూజ నిర్వహించారు. నేరేడుచర్ల పట్టణంతో పాటు మండలంలోని పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు..దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా,అమ్మవారి దర్శనంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కమిటీ చైర్మన్  కొనతం ఆదిరెడ్డి, కొనతం చిన్న వెంకటరెడ్డి, ఆకారపు వెంకటేశ్వర్లు, నాగండ్ల శ్రీధర్, కొనతం మంజులారెడ్డి, కొనతం కృష్ణారెడ్డి బాలెన సైదులు పార్వతి, సంకల మద్ధి సత్యనారాయణ రెడ్డి, బెల్లంకొండ శేఖర్, కొనతం రామిరెడ్డి, కొనతం శ్రీనివాస్ రెడ్డి దంపతులు, వేమిరెడ్డి శంకర్ రెడ్డి,కొనతం లచ్చిరెడ్డి నేనే ఉండు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదం పంపిన నిర్వహించారు.

మరిన్ని వార్తలు