దుర్గ మాత ఆలయంలో ఎమ్మెల్యే పూజ

17-10-2026 | 08:53pm

కుబీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలం(Kubheer mandal)లోని సిరిపెల్లి, పర్డీ (కె) గ్రామాల్లో శనివారం దుర్గాదేవి హారతి(Durga Devi Harati) కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్(MLA Pawar Rama Rao Patel) హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మండలానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు