కాంగ్రెస్ పార్టీలో చేరిన రనిల్ రెడ్డి
బిజెపిలో ఆందోళన
తాడ్వాయి,(విజయక్రాంతి): తాడ్వాయి గ్రామ(Tadwai village) ఉప సర్పంచ్, బీజేపీ పార్టీ నాయకుడైన రనీల్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన రనీల్ రెడ్డి బీజేపీలో చురుకైన కార్యకర్తగా, నాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల బిజెపి లో కలవరం మొదలైంది.
హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు(MLA K. Madan Mohan Rao) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.... తాను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరిన రనీల్ రెడ్డి మాట్లాడుతూ... ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడనై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, తాడువాయి,దేమికలాన్ సింగిల్ విండోల చైర్మన్లు సంతాజి గారి సుధాకర్ రావు, ఏనుగు వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు షౌకత్ అలీ, అఖిల్ రావు, నాయకులు మద్ది మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, మేకల రాజు, గడ్డం కిష్టారెడ్డి, తాటిపాముల ఎల్లా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.