సండే ఆన్ సైకిల్ ర్యాలీకి పోస్టర్ల ఆవిష్కరణ
సూర్యాపేట, నవంబర్ 28 (విజయక్రాంతి): యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు ఫిట్నెస్ (Fitness), పర్యావరణ పరిరక్షణ (Environment Protection)ను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సండే ఆన్ సైకిల్ (Sunday on Cycle) కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జిల్లా ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ పోస్టర్ను విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సైకిల్ ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మై భారత్ వాలంటీర్ వెంకట భవాని కోరారు.