సమాచార హక్కు అమలులో సూర్యాపేటకు రాష్ట్రస్థాయి పురస్కారం

10-10-2026 | 10:52am

సూర్యాపేట, అక్టోబర్ 10 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం–2005 అమలులో సూర్యాపేట జిల్లా రాష్ట్రస్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచి ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందింది. పారదర్శక పాలన, జవాబుదారీతనం, సమాచార హక్కు చట్టం సమర్థవంతమైన అమలులో కనబరిచిన పనితీరుకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ సూర్యాపేట జిల్లాను ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా ఎంపిక చేసింది. 

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన సమాచార హక్కు వారోత్సవాలు–2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. సమాచార హక్కు చట్టం అమలులో జిల్లా సాధించిన ఈ గుర్తింపు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను పలువురు అభినందించారు.

మరిన్ని వార్తలు