ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
17-09-2026 | 04:23pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ప్రజాపాలన వేడుకలను(prajapalana dinotsavam celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరులను(Telangana Martyrs) స్మరించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ ఝాన్సీ,తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్ఐ మధు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.