పాత దొనబండ తండాలో ఎలినోపై అవగాహన సదస్సు
పశువైద్య శిబిరం నిర్వహణ రైతులకు అధికారుల సూచనలు
మఠంపల్లి నవంబర్ 06 (విజయక్రాంతి): మండలంలోని పాత దొనబండ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ(Village Panchayat) లో ఎలినోపై అవగాహన సదస్సుతో పాటు పశువైద్య శిబిరాన్ని(Veterinary camp) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఎల్‌డీఏ సీఈఓ, అదనపు సంచాలకులు (పశుసంవర్ధక శాఖ) డాక్టర్ సుబ్బారాయుడు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.గ్రామ సర్పంచ్ బానోతు ఘుమ్మా మంద నాయక్ తో కలిసి అధికారులు రైతులతో మాట్లాడారు.
ఎలినోపై అవగాహన కల్పిస్తూ,పశువుల ఆరోగ్య పరిరక్షణ, సంతానోత్పత్తి, పశుసంపద అభివృద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు.పశువులకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, పశువైద్యుల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్, ఎన్‌ఎంఆర్‌ఐ సంస్థల డైరెక్టర్లు, పశువైద్యాధికారులు (వీఏఎస్),పారా వెటర్నరీ సిబ్బంది,సూపర్‌వైజర్లు, జీపీఎంలు,ఉపసర్పంచ్ దుబ్ల నాయక్,వార్డు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.