పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి

25-11-2026 | 05:59pm

నాగరాజుపల్లెలో రూ. లక్ష చెక్కు పంపిణీ

నల్లబెల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Donthi Madhava Reddy) ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని నాగరాజుపల్లె గ్రామపంచాయతీకి చెందిన అలుగునూరి అశోక్‌కు మంజూరైన రూ.1,00,000/ లక్ష విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును గ్రామ పార్టీ అధ్యక్షుడు బైరి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ ఎరుకల లలిత రఘు లు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు.కార్యక్రమంలో సర్పంచ్‌ ఏడాకుల సరోజన సంపత్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ బైరి శోభన అశోక్, వార్డు సభ్యులు పబ్బు రాజేష్, ఊటుకూరి కృష్ణ, మాజీ సర్పంచ్‌ ఆసం చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఏడాకుల రవీందర్, పార్టీ బాధ్యులు కదురు దామోదర్, పొన్నాల అమరేందర్,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు