హైటెక్ సిటీ ‘కేర్’కు జేసీఐ అక్రిడిటేషన్

13-10-2026 | 05:05am
  1. నాణ్యమైన సేవలు, రోగుల విశ్వాసానికి గుర్తు
  2. కేర్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ పవన్ కుమార్

హైదరాబాద్, అక్టోబర్ 12(విజయక్రాంతి): ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆరోగ్య సేవల గుర్తింపు సంస్థలలో(Health services accreditation bodies) ఒకటైన జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల(Joint Commission International) (జేసీఐ) నుంచి హైటెక్ సిటీ కేర్ ఆసుపత్రి అక్రిడిటేషన్‌ను(CARE Hospitals Accreditation) సాధించింది. ఈ గుర్తింపుతో రోగి భద్రత, వైద్య నాణ్యత, క్లినికల్ ఎక్సలెన్స్ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్న కొద్దిమంది ఆసుపత్రుల జాబితాలో కేర్ హాస్పిటల్స్ స్థానం సంపాదించినట్లయ్యింది.

ఈ సందర్భంగా ఆసుపత్రి సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ..  రోగులు తమ జీవితంలో అత్యంత కీలకమైన సందర్భాల్లో మాపై విశ్వాసం ఉంచడానికి జేసీఐ అక్రిడిటేషన్ మరింత దోహదం చేస్తుందన్నారు. దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల నెట్‌వర్క్‌లలో ఒకటిగా, క్లినికల్ ఎక్సలెన్స్, రోగి-కేంద్రిత సేవలు, మెరుగైన వైద్య ఫలితాల ద్వారా విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడంపై మా దృష్టి కొనసాగుతుందన్నారు. రీజినల్ సీఈవో నీలేశ్ గుప్తా మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి వైద్య సేవలు అందించాలనే మా బృందం నిబద్ధతకు ప్రతిబింబమన్నారు. ఈ విజయం రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తోడ్పడుతుందని పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు