హెచ్‌ఐవీపై అవగాహన కల్పించాలి
- నర్సింగ్ విద్యార్థులు పీర్ ఎడ్యుకేటర్లుగా కీలక పాత్ర పోషించాలి
- టీజీఎస్‌ఏసీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విద్యాసాగర్
- కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో రెడ్ రిబ్బన్ క్లబ్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్, అక్టోబర్ 5(విజయక్రాంతి) : హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై(HIV/AIDS) అవగాహన పెంచడంతో పాటు వ్యాధి నివారణ(Disease prevention), ముందస్తు పరీక్షలు(Preliminary tests), సామాజిక బాధ్యతపై విద్యార్థుల్లో(students) చైతన్యం కల్పించేందుకు కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్(KIMS College of Nursing), రెడ్ రిబ్బన్ క్లబ్(Red Ribbon Club) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కిమ్స్ ఆసుపత్రి సికింద్రాబాద్(KIMS Hospitals, Secunderabad) 15వ అంతస్తులోని ఆడిటోరియంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీజీఎస్‌ఏసీఎస్) సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఎస్‌ఏసీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె. విద్యాసాగర్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. తెలంగాణతో పాటు దేశంలో హెచ్‌ఐవీ పరిస్థితి, గణాంకాలు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తుగా వ్యాధిని గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తుల పట్ల వివక్ష, అపోహలను తొలగించాల్సిన అవసరాన్ని వివరించారు.
ప్రజల్లో అవగాహన కల్పించడంలో నర్సింగ్ విద్యార్థులు పీర్ ఎడ్యుకేటర్లుగా కీలక పాత్ర పోషించాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు వి విధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పోస్టర్ ప్రదర్శనలు, స్కిట్, క్విజ్ పో టీల ద్వారా హెచ్‌ఐవీ నివారణ, అవగాహన, సామాజిక బాధ్యతకు సంబంధించిన ముఖ్య సందేశాలను ప్రజలకు చేరేలా వివరించారు. కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, టీజీఎస్‌ఏసీఎస్ ప్రతినిధులు, ఎన్ ఎస్‌ఎస్ వాలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.