కీళ్ల నొప్పులకు వయసుతో సంబంధం లేదు

13-10-2026 | 05:00am
  1. మారుతున్న జీవనశైలి కారణం
  2. డబ్ల్యూఏడీ-2026 కిమ్స్ కొంపల్లిలో ఉచిత ఆర్థోపెడిక్ సంప్రదింపులు

హైదరాబాద్, అక్టోబర్ 12(విజయక్రాంతి): కీళ్ల సమస్యలు(Joint problems) వయసు పెరిగిన తర్వాతే వస్తాయనుకోవడం పొరపాటని కిమ్స్ హాస్పిటల్స్(KIMS Hospitals) కొంపల్లి ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు తెలిపారు. మారుతున్న జీవనశైలి, అధిక బరువు, శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనూ కీళ్ల నొప్పుల సమస్యలు(Joint pain issues) కనిపిస్తు న్నాయని పేర్కొన్నారు. ప్రారంభ దశలోనే సమస్యను గుర్తించి తగిన చికిత్స తీసుకోవ డం ద్వారా నొప్పి తీవ్రత పెరగకుండా, రోజువారీ పనులకు ఆటంకం కలగకుండా జాగ్ర త్తపడవచ్చని సూచించారు.

సోమవారం అంతర్జాతీయ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని(International Arthritis Day) (డబ్ల్యూఏడీ-2026) పురస్కరించుకుని కిమ్స్ హాస్పిటల్స్ కొంపల్లి ఆధ్వర్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి ఉచిత ఆర్థోపెడిక్ వైద్య సం ప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి 100 మంది అర్హులైన రోగులకు ఉచిత కన్సల్టేషన్ అం దించడంతో పాటు, గతంలో శస్త్రచికిత్స చే యించుకున్నవారికి కూడా ఉచిత వైద్య సం ప్రదింపులు కల్పించారు. కీళ్ల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, సమస్యలను ముందుగానే గుర్తించేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వైద్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్స్ కొంపల్లి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ సర్జన్లు డా. సాయి ఫణిచంద్ర, డా.డీ హారిప్రకాష్, డా.చైతన్య కిషోర్, డా.రోషన్ కు మార్ జైస్వాల్‌లు మాట్లాడారు. వయసుతో వచ్చే కీళ్ల అరుగుదలతో పాటు, క్రీడల్లో గాయా లు, పాత గాయాలు, కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ సమస్యలు కూడా కీళ్ల నొ ప్పులకు కారణమవుతాయని వివరించారు. ప్రారంభంలోనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పోషక విలువలున్న సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు తగిన వి శ్రాంతి, వ్యాయామం అవసరమన్నారు.

మరిన్ని వార్తలు