వెన్నెముక మన దేహానికి ప్రధాన ఆధారం

16-10-2026 | 05:00am

న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణాదిత్య

వరల్డ్ సైన్స్ డే సందర్భంగా అవగాహన కల్పించిన మెడికవర్ వైద్యులు

నిజామాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): ప్రపంచ వెన్నెముక దినోత్సవం(World Spine Day) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకృష్ణాదిత్య వెన్నెముక ఆరోగ్యం, వెన్నునొప్పి నివా రణ, వెన్నెముక సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకృష్ణాదిత్య మాట్లాడుతూ వెన్నెముక మన శరీరానికి ప్రధాన ఆధారమని, శరీరాన్ని నిటారుగా ఉంచడంలో, కదలికల్లో,   వెన్నుపాము రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ప్రస్తుతం ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం, వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం వంటి కారణాల వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన భంగిమలో కూ ర్చోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకుండా మధ్యమధ్యలో నడవడం, బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరమని సూచించారు.

వెన్నునొప్పితో పాటు కాళ్లు లేదా చేతుల్లో తిమ్మిర్లు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు.వెన్నెముక సంబంధిత సమస్యలను ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చని డాక్టర్ శ్రీకృష్ణాదిత్య పేర్కొన్నారు.మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది.


మరిన్ని వార్తలు