బూడిద చంద్రగిరికి ఓయూ డాక్టరేట్

16-09-2026 | 08:03pm

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బూడిద స్వామి - నాగమ్మ దంపతుల పెద్ద కుమారుడు బూడిద చంద్రగిరికి ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుంచి డాక్టరేట్ పట్టాను (పీహెచ్డీ) అందుకున్నారు. ఈనెల 8న హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భారత్ బయోటెక్ ఫౌండర్, చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ కృష్ణ ఎం. ఎల్లా, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం హాజరయ్యారు.

వారి చేతుల మీదుగా బూడిద చంద్రగిరి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం - బయో టెక్నాలజీ సబ్జెక్ట్ లో  వర్సిటీ ప్రొఫెసర్ పి. రాజారావు పర్యవేక్షణలో   ఐసోలేషన్,  ప్యూరిఫికేషన్ అండ్ ఫైటో కెమికల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ థెరపెటిక్ లీడ్స్ ఫ్రమ్ చెయిలాంథెస్ అల్బోమార్జినాటా అండ్ ఇన్వెస్టిగేటింగ్ దేర్ యాంటీ క్యాన్సర్ మెకానిస్టిక్ ఇన్సైట్స్ యూజింగ్ ఇన్ విట్రో అండ్ ఇన్ వివో ఎవాల్యూషన్ స్టడీస్ అనే అంశం పై చంద్రగిరి తన పరిశోధన పత్రాలను సమర్పించారు. పరిశీలన అనంతరం యూనివర్సిటీ అధికారులు చంద్రగిరికి పీహెచ్డీ డిగ్రీని ప్రధానం చేశారు. 

మరిన్ని వార్తలు