7 September, 2026 | 11:58 AM

అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు

02-09-2026 | 08:20pm

బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన రామచందర్‌రావు

ఆలేరు, సెప్టెంబర్‌ 2 (విజయక్రాంతి): బీజేపీ జిల్లా కార్యాలయంపై దాడికి యత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు అన్నారు. పరకాల పర్యటనలో భాగంగా మార్గమధ్యలో భువనగిరి బైపాస్ వద్ద ఓ ప్రైవేట్‌ హోటల్‌లో బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార మదంతో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ కార్యాలయాన్ని, పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారికి న్యాయపరంగా అండగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల మురళీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు చంద మహేందర్‌, కాదూరి అచ్చయ్య, కార్యదర్శి తడిసిన మల్లారెడ్డి, జిల్లా కోశాధికారి సోమ నరసయ్య, మీడియా కన్వీనర్‌ రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగ నరసింహారావు, పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం, పట్టణ కౌన్సిలర్లు సుచరిత, స్వర్ణలత, ఉడత భాస్కర్‌, చీర్క సురేష్‌రెడ్డి, దయ్యాల కుమార్‌, మామిడోజు పవన్‌, మహమూద్‌, పృద్వి, కారుపాటి రాజు, మాటూరి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు